ఫ్యామిలీ వీక్లో భార్య, కూతురు ఎంట్రీ.. ఆదిరెడ్డి భావోద్వేగం!
on Nov 23, 2022
బిగ్ బాస్ కి అత్యధిక TRPని తెచ్చే ఎపిసోడ్ రానే వచ్చింది. అదే 'ఫ్యామిలీ వీక్'. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు రావడం అనేది బిగ్ బాస్ లో ఆనవాయితీగా ఉంది. కాగా ఈ ఫ్యామిలీ వీక్ లో మొదట ఆదిరెడ్డి భార్య కవిత తమ కూతురు అద్వితతో ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఈ ఫ్యామిలీ వీక్ కంటెస్టెంట్స్ కి మంచి ఎనర్జీని ఇస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు రావడం వల్ల ఇంకా హ్యాపీ గా ఉంటారు. కాగా భార్య కవిత, పాప అద్విత రాగానే ఆదిరెడ్డికి కన్నీళ్ళు ఆగలేదు. పాపని చూడగానే ఆదిరెడ్డి చిన్నపిల్లాడే అయ్యాడు. పాపని లాలించి, తినిపించి, కాసేపు ఆడుకున్నాడు. ఇదంతా బిగ్ బాస్ వీక్షకుల మనసుల్ని హత్తుకుంది.
ఆదిరెడ్డి పాప అద్వితకి ఈ మధ్యనే ఏడాది నిండింది. అప్పుడు ఆదిరెడ్డి ఫ్యామిలీతో లేడు. అందుకుగాను పాప బర్త్ డే వేడుకలను హౌస్ లో సెలబ్రేట్ చేయడానికి బిగ్ బాస్ ప్లాన్ చేసాడు. కేక్ పంపించి పాప పుట్టిన రోజు వేడుకులను జరిపేలా చేసాడు. దీంతో ఆదిరెడ్డి ఎమోషనల్ అయ్యాడు. "థాంక్స్ బిగ్ బాస్.. లవ్ యూ బిగ్ బాస్. నా లైఫ్ లాంగ్ మీకు ఋణపడి ఉంటాను బిగ్ బాస్" అన్నాడు ఆదిరెడ్డి.
ఆ తర్వాత పాప పుట్టిన రోజు వేడుకలు చేసారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి "నేను గేమ్ బాగా ఆడుతున్నానా? నా డ్యాన్స్ ఎలా ఉంది? నేనేమైనా మార్చుకోవాలా? నీ పది ఓట్లు నాకే కదా?" అని కవితను అడిగి తెలుసుకున్నాడు. దానికి కవిత "నీ డ్యాన్స్ కి నవ్వుకుంటున్నాం" అని చెప్పింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
